తిన్న వెంటనే స్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి అలవాటు ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. తినంగానే స్నానం చేస్తే అది రక్తప్రసరణపై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేస్తుందని అంటున్నారు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని.. దీంతో అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అందుకే భోజనం చేశాక 30-40 నిమిషాల తర్వాతే స్నానం చేయాలని సలహా ఇస్తున్నారు.