టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనిపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన కొత్త సినిమా ‘ఇండియన్ 2’ ప్రచారంలో భాగంగా ‘స్టార్స్ స్పోర్ట్స్’ ఛానల్‌కు వెళ్లి.. సినిమా సంగతులు పంచుకున్నారు. ఈ క్రమంలో ధోనీని కొనియాడారు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.