ఆర్మూర్: దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు

71చూసినవారు
ఆర్మూర్: దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు
నందిపేట మండల కేంద్రంలోని చిలకమ్మా మందిరం సమీపంలో షాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించడమే కాక అతనిపై దాడి చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. మల్లయ్య అనే వ్యక్తికి యాక్సిడెంట్ అవ్వడంతో అతని కోసం వెళ్లిన సుధాకర్ యాక్సిడెంట్ చేసిన వారిని అడగగా నీవు ఎవరు నీకెందుకు అని కులం పేరుతో దూషించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్