గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చందూర్ వాసి భూమేష్ ఇళ్లు కూలిపోయింది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వారి ఇంటి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గేవరకు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు ఉండరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.