కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో అతిగా మద్యం తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనుంజయ్ (28) భార్య విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామంలోని వైన్స్ షాప్ పర్మిట్ రూంలో అధికంగా మద్యం సేవించాడు. అనంతరం కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.