బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని తాడుకుల్ బీడీ వర్కర్స్ కాలనీలో నూతనంగా నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ గురువారం పరిశీలించారు. బాన్సువాడ శాసనసభ్యులు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకులో ప్రతి వార్డులో మిగిలిన డ్రైనేజీ పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలని సదరు కాంట్రాక్టర్ కు ఆయన సూచించారు.