బాన్సువాడ: మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి

81చూసినవారు
బాన్సువాడ: మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పట్టణంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్