బాన్సువాడ పట్టణంలోని ఒకటవ వార్డులో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి దావూద్ స్థానిక వార్డు కౌన్సిలర్ అమర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల అర్హులైన ప్రజల నుండి అప్లికేషన్ ఫారంలు తీసుకోవడం జరిగింది.