కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్

454చూసినవారు
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలోని వర్ని(పాత వర్ని), హుంనపూర్, చందూర్ మండలం చందూర్, మోస్రా మండలంలోని గోవుర్, చింతకుంట ప్రాథమిక సహకార సంఘంల (పీఏసీఎస్) పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్ డీసీసీబీ) అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్యేశించి పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.....ఈ యాసంగిలో మద్దతు ధరతో ప్రభుత్వం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలుకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కి రైతుల తరుపున ధన్యవాదాలు తెలిపారు. రైతుల కష్టాలు తెలిసిన మనిషి కాబట్టే రైతులకు రందీ లేకుండా పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సరిగ్గా లేకపోయినా రైతులు ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్యేశంతో పంటల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కానీ, ఇప్పుడు దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా ఇలా మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనడం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇలాంటి దైర్యం చేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి రైతులంటే అపారమైన ప్రేమ. రైతులు బాగుపడాలనే ఉద్యేశంతో అప్పులు చేయకుండా ఉండటానికి పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు అయిదువేల రూపాయలు అందిస్తున్నారు. రైతుబిడ్డ తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గంలో మంజీర నదిపై నాలుగు చెక్ డ్యామ్ లు, ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసి రైతాంగానికి ఏడాది పొడవునా సాగునీటి ఎద్దడి లేకుండా చేసి నియోజకవర్గం నీటితో, పచ్చని పంటపొలాలతో రైతులు ఏటా రెండు పంటలతో ఆనందంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను సమకూర్చుతాం. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే డబ్బులు అందే విధంగా ఏర్పాట్లు చేస్తాం అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో442 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. తేమ 17 శాతం మించకుండా, చెన్ని పట్టి తాలు, పొల్లు లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు సెంటర్లకు తీసుకురావాలి. నాణ్యమైన మేలురకం ధాన్యానికి రూ1888/-, రెండవ రకానికి రూ1868/-ధర ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు.

ఈ కార్యక్రమంలో వర్ని ఎంపీపీ మేక లక్ష్మీ వీర్రాజు, వర్ని జడ్పీటీసీ హరిదాస్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బందెల సంజీవులు, వర్ని తహశీల్దార్ విట్ఠల్, మోస్రా జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మోస్రా ఎంపీపీ పిట్ల ఉమా రాములు, సొసైటీ ఛైర్మన్లు సాయిబాబు, కనక రెడ్డి, మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, గంగారెడ్డి, సర్పంచులు, ఎంపిటీసీలు, నాయకులు సాయిరెడ్డి, హన్మంత్ రెడ్డి, గోపాల్, బాలరాజు, రాజు, సంతోష్, కరీం, అంబరసింగ్, అశోక్, పాత వర్ని, హుంనపూర్, చందూర్, గోవుర్, చింతకుంట గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్