బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ మంగళవారం హాజరయ్యారు. పట్టణంలోని మున్సిపల్, తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు రేవంత్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు.