బాన్సువాడలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

70చూసినవారు
బాన్సువాడలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
బాన్సువాడ పట్టణంలో మంగళవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర కార్పొరేషణ్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, గంగాధర్, కృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్