కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించింది. మరియు స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధనా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు పద్మ శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.