విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు, ప్రతినిధులు.

577చూసినవారు
విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు, ప్రతినిధులు.
కామారెడ్డి జిల్లా, బీర్కూర్ ఉన్నత పాఠశాలలో బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అవగహన కల్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. గత నెల 10 న పాము కాటు తో విద్యార్థి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో విద్యార్థులు భయపడి విద్యార్థులు ఇంటికి వెళ్లి పోవడంతో వసతి గృహం ఖాళీ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని 250 టిప్పర్ల మొరం వేసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పాములు రాకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులు వసతి గృహంలో ఉండకుండా ఇంటి నుంచి పాఠశాల కు వస్తున్నారు. ఇక నుంచి వసతి గృహంలో ఉండి చదువుకోవాలని ఎలాంటి భయం లేదని అధికారులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీడీఓ, ఎమ్ ఆర్ ఓ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్