నసురుల్లాబాద్ లో గ్రామసభను పరిశీలించిన సబ్ కలెక్టర్

62చూసినవారు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభను బుధవార సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ, రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్