పిట్లం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

69చూసినవారు
పిట్లం తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
పిట్లం మండల తాహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే పురోగతిని తాహసిల్దార్ వేణుగోపాల్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు సర్వే 71 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. డాటా ఎంట్రీకి సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్లం తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్