జిల్లా ఆర్యవైశ్య మహాసభ యూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొడ్ల రాజును పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. యూత్ అధ్యక్షునిగా మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు.