బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

64చూసినవారు
బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో మహిళా సాధికారత విభాగం, ఐక్యుఏసి, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ, ముందుతరాలకు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థినిలు తాము తయారుచేసిన బతుకమ్మలను ప్రదర్శించి, బతుకమ్మ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్