పిట్లం మండలంలో బీజేపీ కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి బూత్ అధ్యక్షుడు 100 సభ్యత్వాలు చేయాలనీ, స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయాలి అనుకునేవాళ్లు కచ్చితంగా 100 సభ్యత్వాలు చేసి క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. దీనిలో పిట్లం బీజేపీ మండల అధ్యక్షులు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాజు , తదితరులు పాల్గొనడం జరిగింది.