జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్యెల్యే

72చూసినవారు
జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్యెల్యే
జుక్కల్ సెగ్మెంట్ పిట్లం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలను శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. ఎమ్యెల్యేను విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. ముందుగా ఎమ్యెల్యే పరిసరాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. అటెండెన్స్ పరిశీలించి, భవన నిర్మాణం, అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. విద్యార్థులను వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్