కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామ పరిధిలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఇందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల యొక్క వివరాలు, తదితరు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి పద్మపై కొందరు గ్రామ ప్రజలు విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి విషయాలు కూడా చర్చించలేక ఇష్టపూర్వకంగా వ్యవహరిస్తారని ఆమె పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు.