మద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కృష్ణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన శివ కుమార్ మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా ఇతని స్థానంలో గజ్వేల్ లో విధులు నిర్వహించిన కృష్ణ రెడ్డి మద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నియమితులయ్యారు. గురువారం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఎస్ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ మద్నూర్ ఉమ్మడి మద్నూర్, డోంగ్లీ మండలాల ప్రజలు పోలీస్ సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. చట్టాలను గౌరవించి ఫ్రెండ్లి పోలీస్ కు సహకారం అందించాలని కోరారు. సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.