కుర్తి గ్రామంలో ఘనంగా దుర్గామాతకు పూజలు

66చూసినవారు
కుర్తి గ్రామంలో ఘనంగా దుర్గామాతకు పూజలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి దుర్గ మాత స్వాములు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన స్వాములు దుర్గామాత పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గ్రామానికి చెందిన సపటి హన్మండ్లు దుర్గ మాత స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్