పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలి: జిల్లా కలెక్టర్

54చూసినవారు
పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలి: జిల్లా కలెక్టర్
పశువుల అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. ఈనెల 17 న బక్రీద్ పండుగ సందర్భంగా జంతు సంక్షేమం, గోవధ నిషేధం చట్టం 1977 అమలుపై పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, సంబంధిత పశువుల డాక్టర్ ధ్రువీకరణ లేనిదే ఆవులను తరలించడం నిషేధమన్నారు. జిల్లా పశుసంవర్ధక అధికారి సింహారావు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్