ఆన్‌లైన్‌లో సిలబస్, శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని CBSE హెచ్చరించింది. 2024- 25 విద్యా సంవత్సరానికిగానూ అప్టేటెడ్ ఇన్ఫర్మేషన్ పేరుతో పాత లింకులు, వార్తలు ప్రచారంలో ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అనధికార సోర్స్‌ల నుంచి వచ్చే సమాచారం స్కూళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయవచ్చని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.