జానకంపేట్: ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది

76చూసినవారు
ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికీ చెందిన మల్లేష్ (24) అనే యువకుడు బుధవారం కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 కు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నా వారు ఈఎంటీ లలిత, పైలట్ మురళీ కృష్ణ సహాయంతో అపస్మారక స్థితిలో ఉన్న మల్లేష్ ను సీపీఆర్ చేసి కృత్రిమ శ్వాస అందిస్తు జిజిహెచ్ నిజామాబాద్ కు తరలించి ప్రాణాలు కాపాడారు.

సంబంధిత పోస్ట్