బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పొందుర్తి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనస్వాగతం పలికారు. ఆదిలాబాద్ రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న రైతు ధర్నాకు వెళ్తున్న కేటీఆర్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దీన్ తో పాటు నాయకులు కలిశారు. భారీ ఎత్తున కామారెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ ల నుండి బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు.