జప్తి జానకంపల్లిలో ఘనంగా బోనాల పండుగ

50చూసినవారు
జప్తి జానకంపల్లిలో ఘనంగా బోనాల పండుగ
నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లిలో ఆదివారం ముత్యాల పోచమ్మకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మ, గండి మైసమ్మ, కట్ట మైసమ్మ, గంగమ్మ, లక్ష్మమ్మ, దుర్గమ్మ, దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా పాడిపంటలు, పిల్ల పాపలు చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దేశ బోయిన సాయిలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్