నాగిరెడ్డిపేట మండలంలో రోడ్డు వెడల్పులో భాగంగా గురువారం పలు ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు రెండు వరసల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న పాత ఇళ్లను పంచాయతీ సిబ్బంది కూల్చి వేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.