ఎల్లారెడ్డి ప్రజలకు పిచ్చి కుక్కలు భయం పట్టుకుంది. చిన్న పిల్లలపై కుక్కల దాడులు పెరిగాయి. ఎక్కడ చూసిన గుంపులుగా కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయి. ఆసుపత్రిలో కుక్క కాటుకు వైద్యం చేయించుకుంటున్న వారి జాబితా చూస్తే కుక్కలు ఎలా రెచ్చి పోతున్నాయో తెలుస్తుంది. పరిస్థితి చేయిదాటిపోక ముందే మున్సిపాలిటీ స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.