గంగమ్మ వాగు వద్ద కల్వర్టు నిర్మాణం పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి గ్రామ శివారులోని గంగమ్మ వాగు వద్ద కల్వర్టు పనులను పరిశీలించారు. కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్అంద్ బి ఈఈ రవిశంకర్, డిఈ జలిగామ శ్రీనివాస్ ఆదేశించారు. రామారెడ్డిలోని కస్తూరిబా పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.