ఎల్లారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ నిర్వహించిన మదనన్న మండలస్థాయి కబడ్డీ పోటీలో శుక్రవారం జరిగిన ఫైనల్ లో కబడ్డీ పోటీల్లో హాజిపూర్ తండా కబడ్డీ జట్టు ఘనవిజయం సాధించి మొదటి బహుమతి 51, 000రూపాయల సొంతం చేసుకున్నారు. రెండో విజేతగా ఎల్లారెడ్డి టీం (A) 21, 000బహుమతి గెలుపొందారు. మూడవ విజేతగా జాయింట్ విన్నర్ ( భిక్కనూర్ -మాచపూర్) రూ. 11, 000 బహుమతి గెలుచుకున్నారు.