మదర్సలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

64చూసినవారు
ఎల్లారెడ్డిలోని సోమార్ పేట్ బేస్ ప్రాంతలో గల మదర్స అబ్బెస్ పాఠశాలలో, గురువారం 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింల సదర్, మాజీ జెడ్పిటిసి గయాజుద్దీన్ హాజరై జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు. నాడు స్వతంత్ర సంగ్రామంలో కుల మతాలకు అతీతంగా స్వాతంత్య్ర సాధించడమే లక్ష్యంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని కలిగి ఉండాలని అన్నారు.