కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో గురువారం పి. మేఘవర్ణ తల్లి జ్ఞాపకార్థం 20 మంది బీదవాళ్లకు ఆర్టిఐ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్ణ చంద్రోదయ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దానగుణం అందరూ అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరు దయాగుణం కలిగి ఉండాలన్నారు. దుప్పట్లు పంపిణీ చేసిన ఉపాధ్యాయురాలిని అభినందించారు.