ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది. ఓ తరగతి గది మరి ప్రమాదకర స్థితిలో ఉంది. స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. అయిన ఆ గదిలోనే విద్యార్థులను స్లాబ్ పెచ్చులుడే ప్రాంతం కింద కాకుండా విద్యార్థులను దూరం కూర్చో బెడుతున్నారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే గాని ఈసర్కార్ కి పట్టింపు ఉండదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.