కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

59చూసినవారు
కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
కుటుంబ కలహాలతో కన్నతండ్రిని కొడుకే అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన HYD శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్ దొడ్డిలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆకుల రాములు(55) అతని కొడుకు ఆకుల శివ కుమార్ ఇద్దరూ పరస్పరం గొడవపడ్డారని, దాని కారణంగానే తండ్రిపై శివ కుమార్ గొడ్డలితో కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్