TG: డబ్బుల కోసం ఓ తల్లి కన్న బిడ్డలనే అమ్ముకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూరులోని మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి ఏడేళ్ల కుమారుడు, ఇద్దరు ఐదేళ్ల కవలలు ఉన్నారు. ఈమె మొదటి భర్తకు ఏమైందో తెలియదు. రెండో వివాహం చేసుకుంది. తన ముగ్గురు పిల్లలను 10 నెలల క్రితం గంగాధర్, నర్సయ్య, వనజ అనే వ్యక్తులకు రూ..4.20 లక్షలకు విక్రయించింది. పోలీసులు ఆమెను విచారించగా నేరం అంగీకరించింది.