ఎండపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం

52చూసినవారు
ఎండపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం
ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్