మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

75చూసినవారు
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ధర్మారం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడారం పీ.హెచ్.సీ వైద్యాధికారి డాక్టర్ సుస్మిత సూచించారు. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. వడదెబ్బ తగిలిన వారిలో జ్వరం అకస్మాత్తుగా 105 నుండి 107 డిగ్రీల వరకు ఉంటుందని తెలిపారు. వడదెబ్బకు గురైన వారు వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్