పార్టీ ఫిరాయింపుల పైన హై కోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీపైన బురద జల్లే ప్రయత్నమే తప్ప దీనివల్ల ప్రజలకు మేలు జరిదేగి ఏమి లేదన్నారు.