జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల సెలవులు

62చూసినవారు
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజుల సెలవులు
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించామని కార్యదర్శి మల్లేశం శుక్రవారం తెలిపారు. ఈ నెల 14న శనివారం వారాంతపు యార్డు బంద్, 15న ఆదివారం సాధారణ సెలవు, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబి సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 18న బుధవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్