కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో వైద్య ఉద్యోగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంకు చెందిన రమేష్ ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంగ్ గా విధులు ముగించుకుని తన బైక్ పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియాని కార్ ఢీ కొట్టటంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి మృతితో ఇద్దరు ఆడ పిల్లలు అనాథలుగా మారారు.