హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రణవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం లబ్దిదారులకు పంపిణీ చేశారు. ప్రణవ్ మాట్లాడుతూ 74 మందికి రూ. 32 లక్షల 54 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సబ్బండవర్గాలకు న్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా సంప్రదించాలన్నారు.