హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ కరీంనగర్ అర్బన్ సిటీలోని గౌట్ హైస్కూల్, కుమార్ వాడి, రాంనగర్, పద్మా నగర్ లలో గౌట్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న 133 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు శుక్రవారం పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.