హుజురాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగి శెట్టి రాజు తన స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ సినీ నటుడు రామ్ చరణ్ ఆంధ్రప్రదేశ్ లో కడప దర్గాను సందర్శించినందుకు మతపరమైన ఆచారాలను గౌరవించలేదని విమర్శించారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని మరియు హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.