ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కార్తీక మాసం ముందు నుంచి కొబ్బరికాయ ధర రూ. 25 ఉండగా ప్రస్తుతం రూ. 35 వరకు చేరింది. హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం దేవాలయం, శుభకార్యాలలో ఉపయోగం తప్పనిసరి. ఇంకా ఈ సంవత్సరం అదిక వర్షాలు, తక్కువ దిగుబడి వల్ల ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు, ఇంకా ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.