కరీంనగర్ నగర శివారు డివిజన్ తీగలగుట్టపల్లిలోని ఊరకుంట చెరువువద్ద గల ఖాళీ స్థలాల్లో ఒక కొండ చిలువ స్థానికులకు కనపడింది. ఈ విషయాన్ని డివిజన్ ప్రజలు స్థానిక కార్పొరేటర్ కాశెట్టి లావణ్య - శ్రీనివాస్ దృష్టి కి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్ పాములు పట్టేవారికి సమాచారం అందించి కొండచిలువను పట్టి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.