పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ

59చూసినవారు
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లందకుంట రామాలయానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్షాన రాములోరికి మంగళవారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, వేదపండితులు ముత్యాల శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ వావిలాల తిరుపతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్