ఆస్తి పన్ను చెల్లించని నర్సింగ్ హోమ్ సీజ్

3342చూసినవారు
ఆస్తి పన్ను చెల్లించని నర్సింగ్ హోమ్ సీజ్
పట్టణంలో ఆస్తి పన్ను బకాయి చెల్లించని ఓ నర్సింగ్ హోమ్ ను అధికారులు సీజ్ చేశారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ఓ నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మార్చి 31లోగా ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. రెండు సంవత్సరాలుగా ఆ నర్సింగ్ హోమ్ ఆస్తి పన్ను రూ. లక్షా 13వేలు బకాయి ఉన్నట్టు తెలిపారు. దీంతో గడువు ముగియడంతో ఆ నర్సింగ్ హోంను సీజ్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్