కమలాపూర్ లో గురువారం బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని వారు మండిపడ్డారు. కౌశిక్ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.