జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట వైద్య ఉపకేంద్రం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం మమత గత కొంతకాలంగా విధులకు రావడంలేదని ఆమెపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తిప్పన్నపేటలోని వైద్య ఉప కేంద్రం ఎదుట వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిపన్నపేట గ్రామ అధ్యక్షుడు చింతకుంట గంగాధర్, మాదిరి రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు